ఈశాక్రియ గురించి ఇతరులేమంటున్నారు.
" నేను ఈశా క్రియను ఐదు నెలలుగా సాధన చేస్తున్నాను. దాని వల్ల నాలో నేను చాలా గొప్ప మార్పులు చూశాను. నేనిప్పుడు దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించటం లేదు. “ఎందుకిలా” అని అన్నిటి గురించీ తెలుసుకోవాలనే నా కుతూహలం కూడా తగ్గిపోయింది. జీవితం ఏ సంఘర్షణా లేకుండా సాఫీగా సాగిపోతున్నట్టు అనిపిస్తుంది. "
- మేరీ, కొలరాడో, యుఎస్ఏ
“ నేను ఈశాక్రియ సాధన చేశాను. ఆన్లైన్ వీడియో ద్వారా కూడా సద్గురుతో ధ్యానం ఎంతో శక్తివంతంగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాను. ఖచ్చితంగా నాలో నేను ఒక రకమైన ప్రశాంతతనీ, స్థిరత్వాన్నీ, బంధవిముక్తినీ అనభూతి చెందాను."
– ఓల్గా అవిలా, హాలెండ్
" ఇవాళ నేను ఈశా క్రియ ప్రక్రియను సాధన చేశాను. నా కళ్ళలోంచి కన్నీళ్లు ఉప్పొంగాయి... నాకు ఎదో అనిపించింది – ఈ అనుభూతిని ఇంకా ఎక్కువ సేపు ఆస్వాదించాలనే కోరిక కలిగింది."
– అపర్ణ , ఇండియా
" నాకు సహాయం చేసినందుకు ఎన్నో కృతఙ్ఞతలు సద్గురూ! నేను క్రిందటి సంవత్సరం జులైలో, ఫ్లోరిడాలో ఇన్నర్ ఇంజనీరింగ్ కార్యక్రమం చేసి, ఎంతో ప్రశాంతతతో తిరిగి వచ్చాను. కాని డిసెంబర్లో మోకాలి శస్త్రచికిత్స అనంతరం, నా శరీరం, మనస్సులతో ఎంతో అవస్థపడ్డాను. కాని కేవలం ఈశా క్రియ వినడం వల్ల మళ్ళీ అదే ప్రశాంతతను పొందగలిగాను."
– గిల్ జోన్స్, యుఎస్ఏ
" ఈ క్రియ చాలా అద్భుతమైనది. ఇది ఎంతో సున్నితమైనది, ఎంతో సరళమైనది. అయినప్పటికీ, ఇది మీకు ఎంతో ప్రగాఢ అనుభూతిని కలిగిస్తుంది. ఎంతో సునాయాసంగా మిమ్మల్ని శక్తివంతుల్ని చేస్తుంది. ఇది శాంభవి, శక్తి చలన క్రియ, శూన్యల మధ్య ఎంతో చక్కగా ఓదిగిపోయిందని నాకు అనిపిస్తుంది."
– నాదేశ్, పెడియాట్రిక్ సర్జెన్, మలేసియా
" ఒక స్నేహితుడు చెప్పటంవల్ల సద్గురు ఏమి చెప్తారో వినటానికి ఈ సంవత్సరం మార్చ్ నెలలో వెళ్ళాను. ఇంతకు ముందు నాకు ధ్యానంలో అనుభవం లేదు,యోగాలో అనుభవం కూడా అంతంత మాత్రమే. ఆయన అక్కడ నేర్పిన ధ్యాన ప్రక్రియ అనుభవం ఎంతో అధ్బుతంగా ఉంది. ఆ ఒక్క చిన్న అనుభవంతోటే నేను ఎంతో అంతర్గత శాంతిని పొందాను. దీనితో నా వ్యక్తిగత జీవితంలోని ఒక కష్ట సమయాన్ని నేను అనుకున్నదాని కంటే ఎంతో బాగా నిర్వహించాను. సద్గురు సమయస్ఫూర్తి , జీవితం మరియు ప్రపంచం మీద ఆయనకున్న దృక్పధం అందరూ నేర్చుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను." - అలిడా హోర్నే, లీగల్ సెక్రటరీ, పెన్సిల్వేనియా, యుఎస్ఏ