ఈశా క్రియ అంటే ఏమిటి?
ఈ కాలంలో, చాలామందికి యోగా అనగానే శరీరాన్ని అతికష్టమైన భంగిమలలోకి వంచే చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఈ యోగా శాస్త్రంలోని అనేక కోణాలలో శరీర సంబంధమైన యోగా ఒక అంశం మాత్రమే. శరీరాన్నీ, మనసునీ వాటి అత్యుత్తమ సామర్ధ్యానికి తీసుకు వచ్చి ఒక మనిషిని తన జీవితాన్ని పూర్తిగా అనుభవింపజేసే సాంకేతికతే(టెక్నాలజీయే) యోగ.
ప్రతి మనిషికీ ఒక్క చుక్కంత ఆధ్యాత్మికతనైనా అందించాలన్నదే సిద్ధయోగి, గురువు ఐన సద్గురు ధ్యేయం. ఒకప్పుడు యోగులకు, సాధువులకు మాత్రమే అందుబాటులో ఉండే ఆధ్యాత్మిక ప్రక్రియల ప్రయోజనాలు ఇప్పుడు ఈశాక్రియ ద్వారా ప్రతి వ్యక్తికీ తమ ఇంట్లోనే అందించబడుతున్నాయి.
సద్గురుచే రూపొందించబడిన ఈ ఈశాక్రియ సనాతన యోగా విఙ్ఞానానికి సంబంధించినది. ఈశాక్రియ సులువైనదీ, అదే సమయంలో చాలా శక్తివంతమైనది. ఈశా అంటే సృష్టికి మూలం అని అర్ధం, క్రియ అంటే అంతర్గత చర్య అని అర్ధం. ఒక వ్యక్తి తన ఉనికి మూలాన్ని చేరుకోవడంలో, తన జీవితాన్ని తను కోరుకునే విధంగా మలచుకోవడంలో తోడ్పడడమే ఈశాక్రియ లక్ష్యం. ఈశాక్రియను ప్రతిరోజూ సాధన చేయడం వలన ఆరోగ్యం, చైతన్యం, ప్రశాంతత, శ్రేయస్సు కలుగుతాయి. ఆధునిక జీవితంలోని ఒత్తిడులను తట్టుకునేందుకు ఇది ఒక శక్తివంతమైన సాధనం.
ఈశాక్రియ ఉచితం, సరళం మరియు సులుభమైన సాధన. సూచనలతో కూడిన వీడియోగా ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఈ గైడెడ్ మెడిటేషన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. రోజుకు కేవలం కొద్ది నిమిషాలను పెట్టుబడిగా పెట్టడానికి సిద్ధంగా ఉన్న ఎవరి జీవితంలోనైనా పరివర్తన తీసుకు రాగల సామర్ధ్యం ఈ ధ్యానానికి ఉంది.
‘సద్గురు’ గురించి
సందర్శించండి Isha.Sadhguru.org
సందర్శించండి IshaFoundation.org
యోగి, మర్మఙ్ఞులు, కవి, దార్శనికులు, మానవతా వాది ఐన సద్గురు ఒక వైవిధ్యమైన ఆధ్యాత్మిక గురువు. ఆయన జీవితమూ, కృషీ అంతా కూడా ప్రతి మనిషి తన అస్థిత్వ మూలంలో వ్యాపించి ఉన్న ప్రశాంతతనీ, ఆనందాన్నీఅనుభూతి చెందేలా చేయడం గురించే. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో పరివర్తన తీసుకొచ్చుకుని, తమ జీవితాలను తమ చేతులలోకి తీసుకునేందుకు వీలుగా వారికి ఒక చుక్కంత ఆధ్యాత్మికతనైనా అందించడమే ఆయన లక్ష్యం.
దాతలు
అనుసరించండి:
తరచుగా అడిగే ప్రశ్నలు
తరచుగా అడిగే ప్రశ్నలన్నిటినీ ఇక్కడ చదవండి
ఈశాక్రియ గురించి ఇతరులేమంటున్నారు.
"నాకు సహాయం చేసినందుకు ఎన్నో కృతఙ్ఞతలు సద్గురూ! నేను క్రిందటి సంవత్సరం జులైలో, ఫ్లోరిడాలో ఇన్నర్ ఇంజనీరింగ్ కార్యక్రమం చేసి, ఎంతో ప్రశాంతతతో తిరిగి వచ్చాను. కాని డిసెంబర్లో మోకాలి శస్త్రచికిత్స అనంతరం, నా శరీరాన్ని, మనస్సును తట్టుకోవడం ఎంతో కష్టమనిపించింది. కాని కేవలం ఈశా క్రియ వినడం వల్ల మళ్ళీ అదే ప్రశాంతతను పొందగలిగాను."
֠గిల్ జోన్స్, యుఎస్ఎ
"నేను ఈశాక్రియ సాధన చేశాను. ఆన్ లైన్ వీడియో ద్వారా కూడా సద్గురుతో ధ్యానం ఎంత శక్తివంతంగా ఉంటుందో అన్న విషయం గ్రహించి ఆశ్చర్యపోయాను. ఖచ్చితంగా నాలో నేను ఒక రకమైన ప్రశాంతతనీ, స్థిరత్వాన్నీ, బంధవిముక్తినీ అనభూతి చెందాను."
֠ఓల్గా అవిలా, హాలెండ్
ఇంకా చదవండి